- నీ పురిటి నొప్పుల పరీక్షకు జవాబుగా పుడమిని తాకిన నేను , పరిచయం లేకుండానే నీ స్పర్సతో ప్రశాంతత పొందితిని .
- భాదనోన్నపుడు , భయభ్రాంతి చెందినపుడు భావ వ్యక్తికరింప అలవికానప్పుడు , చెప్పకనే చెంత చేరి చిట్టి మనసుకు స్వాంతన చేకుర్చితివి .
- కొత్త విషయాలు , సరికొత్త ఆట-పాటలతో ఆనందమయ వాతావరణం నెలకొల్ప , నీవే ఒక ఆట వస్తువుల మారి అలరించితివి .
- మారం చేసినపుడు , మొండికేసినపుడు మంచి మాటలు చెప్పి నొప్పించక ఒప్పించి మంచి దారిన నడిపింప ఎల్లపుడు ముందుంటివి .
- అస్వస్తత నొందినపుడు అహర్నిశలు శ్రమించి స్వస్తత చేకూరే వరకు చిరున్నవుతో చెంతన చేర్చుకుంటివి .
- లక్ష్య సాధనలో అలసిన మనసుకు ఆప్త మిత్రునిలా ఆశ్వాసన చేకూర్చి క్రొంగొత్త ఆశను చిగురింప చేసితివి .
- వేసే ప్రతి అడుగు విజయానికి చేరువయ్యేలా విలువ అయిన సూచనలు ఇస్తూ మార్గదర్శకం చేసితివి .
- గమ్యానికి చేరువయి , నిను విడిచి దూరంగా ఉండవలసి వచ్చినపుడు చెమ్మగిల్లిన కళ్ళతో ఉన్నతిని కాంక్షిస్తూ ఆశీర్వచనము ఇచ్చితివి .
- చల్లని ఓదార్పు హస్తంతో , చిరునవ్వుల విరి వానలు పంచే అమ్మ నీవు ఎప్పటికి ఇలానే ఆయురారోగ్యాలతో వుండాలని , ఏ జన్మనైన నీ పాపగా నే పుట్టాలని ప్రార్దిస్తూ HAPPY MOTHER'S DAY .