- అలుపెరుగక కదిలే కడలి కెరటాలు మనసుకు ఆహ్లాదం చేకూర్చినపుడు
- పరుగులు తీసే పసి కూనను చూసి పరవశమొందినపుడు
- సూర్యుని గమనముచే చంద్ర కాంతిని కాంచకలిగినపుడు
- పుడమిని వర్షధారలతో ముద్దాడ ,మబ్బుల సమూహం పర్వత ఆలింగనముకై కదిలినపుడు
- పుప్పొడి రేణువులతో పుష్పములకు పరాగ సంపర్కం జరప పయన మొందిన బ్రమరాన్ని చూసినపుడు
- దేశ కాల పరిస్థితుల దృష్ట్యా విహంగ పయనమొండ వలసినపుడు
- మార్పు మంచిని సంకేతిస్తూ ప్రకృతిలోని పరమాత్మ తత్వాన్ని పరిగణలోకి తీసుకున్న మదిన ప్రశాంతత కలుగనన్న సత్యాన్ని అవగతమొందించాయి .