- అమ్మ కడుపులో అపురూపముగా పెరుగుతున్న నేను నవమాసముల తర్వాత ఏడుస్తూ ఆ రక్షణ కవచములో నుండి బయటకి వచ్చాను .
- కొత్త కొత్త బంధాలు చేయి చాచి ఓదార్చగా , ఊరడిల్లితిని .
- ఊయల వయసు నుండి ఊహ తెలిసే వరకు , రాత్రి పగలు లేకుండా కంటికి రెప్పలా కాపు కాసి సపర్యలు చేసితిరి .
- మాటలు రాని సమయములో , చెప్పకనే చెంత చేరి , చింత దీర్చి , చెక్కిళ్ళపై చిరునవ్వుల పుష్పాలు పూయింపచేసారు .
- నడక నేర్పించు సమయములో , తమ కాళ్ళపై నా పాదాలను ఉంచి , వెనుకడుగు వేస్తూ నేను ముందడుగు వేస్తుంటే మురిసిపోయారు .
- తమ కళ్ళతో లోకాన్ని పరిచయం చేసారు . ఆ కళ్ళలోని కన్నీరుని మాత్రం కనుపడనీయలేదు .
- దైవం,అమ్మ ,నాన్న ,అక్క ,అన్న ,మావయ్య ,స్నేహితులు ఇలా ఎన్నో బంధాలు ఈ రెండు దశాబ్దాల నుండి నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి .
- మరియొక కొత్త బంధం కొత్త సంగతులు నేర్పించడానికి దైవ నిర్ణయముగా ముడిపడపోతున్నది .
- ఈ బంధములో అన్ని రూపములు కనిపించాయి . అమ్మలా నన్ను అర్ధం చేసుకున్నది . నాన్నలా నాకు మార్గం చూపిస్తున్నది . అక్కలా నా శ్రేయస్సు కోరుచున్నది . స్నేహితునిలా నా బలం,బలహీనతలు తెలిసి సలహాలు ఇస్తున్నది .
- అందుకేనేమో కొన్ని బంధాలు రక్తసంబంధమైనా , కొంత కాలమే జీవితములో ప్రధానముగా ఉంటాయి . కాని కొన్ని బంధాలు ఒక్కసారి ముడిపడ్డాక , ఆ బంధమే జీవితమవుతుంది . జీవితాంతం కలిసి నమనతో ప్రయాణం చేస్తుంది .
- మన చుట్టూ ఎంతో మంది ఉన్నా , కొన్ని విషయాలు కొందరితోనే చెప్పగలం . కాని ఈ బంధములో దాపరికం అనేది కనిపించదు . దాచడానికి , దాటవేయడానికి ఆస్కారమేమి కనిపించదు .
- ఇది చెప్పాలా , ఇది చెప్పకూడడా అని ఏమి సంకోచం లేకుండా , అన్ని విషయాలు చెప్పగలిగే బంధమిదేనని అనిపిస్తుంది . ఎందుకంటే ప్రకృతి ,పరమాత్మ వేరు కాదు. ప్రకృతిలోనే పరమాత్మ ఒకటై వుంటాడు . భార్యాభర్తల బంధం అలానే రెండుగా కనిపించే ఒక్కటైనా పదార్దం .
- ఒక్కసారి ఈ బంధములోకి వచ్చాక , ఎక్కడికి వెళ్ళినా , ఎవరితో వున్నా , ఏ సంతోషం అనుభవములొకి వచ్చినా , ఏ బాధ కలిగినా మొదటిగా గుర్తుకు వచ్చేది భర్త మాత్రమే . ఎంత త్వరగా తనతో పంచుకుందామా అనిపిస్తుంది . తను లేకుండా కలిగిన సంతోషం పూర్ణత్వం కలిగించదు .
- జంట పక్షులను చూసినా, చల్లని గాలులు వీస్తున్నా , అలల ఒంపులను తిలకించినా , సూర్య గమనాన్ని వీక్షిస్తున్నా ,ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఉచ్వాస , నిచ్వాసలో వా రే గుర్తుకు వస్తారు .
- కాలంలో పుట్టి ఇన్ని బంధములతో మీ జీవితములో ప్రవేశిo చబోతున్న , మీ ఒక్క బంధములో ఈ బంధాల రక్షణ అన్ని కల్పింప చేయగలుగుతున్నారు .
- ఇప్పటివరకూ , కూతిరిలా , కన్నెపిల్లలా ఆలోచించడమే తెలుసు. ఈ బంధం నుండి అమ్మ అయ్యేలా ఆలోచించమని బోధించారు .ఈ కొత్త కోణములో అలోచించి ఆచరణ పెట్టేప్పుడు సున్నితముగా సహకరిస్తారని ఆశిస్తున్నాను .
- జీవితములో ముడిపడే ప్రతి బంధం కొత్త భాద్యతలను నేర్పిస్తుంది . అందుకే ప్రతి బంధం కొత్త భవిష్యత్తుకు పునాది . బంధాలకు కాలపరిమితులు ఉండవు . మనస్సు ఉన్నంత కాలం , మనిషి ఉన్నంతకాలం తోడుండి ఇవి నడిపిస్తానే వుంటాయి .
- దైవ సంకల్పమైన మన ఈ బంధం నమ్మకం పునాది మీద , ఒకరి మీద మరిఒకరికి వున్న ఆప్యాయతలే ఆసరాగా , ఒకరి బలహీనతలు ఇంకొకరు బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఆదర్శవంతముగా సాగాలని ఆ శ్రీరామ చంద్రుని పాదములు పట్టి ప్రార్దించుచున్నాను .
- ......... జై శ్రీరామా .....
Sunday, January 11, 2015
బంధం
Subscribe to:
Comments (Atom)