- మహర్షులు ఈ కర్మభూమి ఫై చేసిన తపస్సు ఫలితమా అన్నట్లు నీతి ,న్యాయం ,ధర్మం ,నిజాయితి ,సత్యం అనే పంచేంద్రియాలతో "వేదభూమి " జనియించినది .
- నడక ప్రారంభించిన తరుణములో ఋగ్వేద ,యజుర్వేద,సామవేద,అధర్వణ వేదములనెడి నాలుగు కాళ్ళ ఆసరాతో కదలాడుతూ ప్రపంచాన్ని చూడ ఆరంభించెను .
- జీవనాధారమైన గాలి,నింగి,నేల , నీరు,నిప్పు అనెడి పంచభూతములకు అంజలి ఘటిస్తూ ,ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుకి "ఆదిత్య హృదయముతో " కృతజ్ఞతలు తెల్పుతూ ఉదయాన్ని ఆరంభించెను .
- తన ముంగిట్లో నడయాడిన ఎందరో పుణ్య మూర్తుల గాధలను "రామాయణ ,మహాభారత,భాగవత రూపములొ ప్రతి దినం పటిస్తూ పరవసించిపొయెది .
- "తమసోమా జ్యోతిర్గమయ " అని భక్తి భావనలో భగవంతుని ఆరాధిస్తూ తన్మయత్వంతో తనువు ,మనసు పరమాత్మఫై లగ్నం చేసి పులకరించిపోయేది .
- "ధర్మో రక్షిత రక్షః "అనే సిద్దాంతములను కట్టుబాటుగా దైనందిన జీవనములో అలవరచుకొని తీరం దాటని ప్రవాహములా నీతివంత జీవనాన్ని కొనసాగించెను .
- వర్తక సంబంధాల కోసం తన ఇంటికి వస్తున్న పరాయి దేశస్తులను "ఆతిథి దేవోభవ " అన్నట్లు సొంత మిత్రులుగా భావించి ఆదరించెను.
- విభిన్న సాంప్రదాయాలను,సంస్కృతులను ,ఆచారాలను అగౌరవ పరచక ఆచరించేవారి మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తపడెను .
- దేశ భాషలు వేరు అయినా స్నేహభావంతో తన గడ్డఫై కాలుమోపిన "అరబ్భులు,పర్షియన్లు ,పోర్చుగీసు ,గ్రీసు ,బ్రిటిషర్లు ఇలా ప్రతి ఒక్కరికి ఆతిద్యమిచ్చిను .
- కాలం మారి " ఓడలు బండ్లు అయినట్లు " ఆతిద్యమిచ్చిన మనమే బ్రితిషర్లుకు బానిసలుగా రెండు శతాబ్దాలు బ్రతుకవలసినా ఓర్పుతో సహించింది .
- ప్రపంచానికి అహింసావాదంలోని గొప్పతనాన్ని చాటిచెపుతూ బ్రిటిషర్ల చెర నుండి విముక్తి పొంది స్వాతంత్రం పొందినది .
- సంపదలు కొల్లగొట్టుకు పోయినా ప్రజలే సంపదలుగా రాజ్యాంగాన్ని స్థాపించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించెను .
- కాషాయం -త్యాగానికి ,ఆకుపచ్చ -సస్యశ్యామలకు ,తెలుపు-శాంతికి ,నీలి రంగు అశోకుని చక్రము-ధర్మమునకు నిదర్సనముగా ఈ విలువలు అనే వలువలను ధరించి వినువీధిలో రెపరెపలాడింది .
- గడచిన కాలంలో గర్వముగా చాటిన సందర్భాలు వున్నాయి అలానే గుండెలు చెదరిన సందర్భములు వున్నాయి .. ఈ ఎత్తుపల్లాలను ఆనందముగా స్వీకరించి అలుపెరుగని ప్రయాణము చేస్తూనే వున్నది నా భారతావని .
అమెరికాని కోలంబస్ కనుగొన్న ఆధారం వుంది కాని ఈ సప్తర్హులు నడయాడిన పుణ్యభూమి ఎప్పుడు ఉద్బవించినదో సాక్షము లేదు .. ఎన్నో తరాల చరిత్ర పునాదులుగా నిర్మితమయిన ఈ జంభుద్వీపం వొంటిఫై రెండు శతాబ్దాల బానిస బ్రతుకు మాత్రం నల్లని మచ్చగా మిగిలి పోయింది . ఈ చెర నుండి విముక్తి అయి 67 వసంతాలు దాటినా శుభ సందర్భమున అందరికి మనస్పూర్తిగా స్వాతంత్ర దినోత్స్తవ శుభాకాంక్షలు తెల్పుచున్నాను .
........ జై హింద్ ........
No comments:
Post a Comment