మనిషిని ఇక్కడ ఉన్నాను ,కాని మనసు మీ దగ్గరే ఉండిపోయింది . ఈ మనస్సు ఎందుకింత ఆరాటపడుతుందో తెలియదు. నిశ్చలముగా వుండే మనస్సులో ఈ అలజడి ఎందుకో . చిత్రముగా ఇప్పుడే పరిచయమైన వ్యక్తి కోసం తపించిపోతుంది ఎందుకో . బంధాలు ఇంత త్వరగా ఏర్పడతాయా? . మనసులు ఇంత త్వరగా ఒకటవుతాయా?అప్రయత్నముగా రోజులు గడిచిపోతున్నాయి . కాని ఎప్పుడు ఒకటవుతామనే ఆలోచనలే . చుట్టూ ఎంతో జరుగుతున్నా మనస్సు నిలవదు ఎందుకో . ఇంత పెను మార్పు మునుపెన్నడూ జరిగినట్టు లేదే . లేచిన దగ్గర నుండి , రాత్రి జరిగిన సంబాషనలే . కనులు మూస్తే మీరే గుర్తుకు వస్తున్నారు . తినేటప్పుడు , పడుకునేటప్పుడు ఒక్కటేమిటి ఏ పని చేసిన మీరే ఎందుకు గుర్తుకు వస్తున్నారు ? ఇంతగా నా మనస్సు చేయి దాటింది లేదే . ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు ఎందుకు ? మీరు కాకుండా వేరే వాటిమీద ఆసక్తి ఎందుకు వుండటం లేదు ?నా ఆలోచనలు ,అలవాట్లు ఇంతలా మారిపోయాయి ఎందుకు ? ఏమి తినాలని అనిపించడం లేదు ,ఎక్కడకి వెళ్ళాలని అనిపించడం లేదు .ఎప్పుదెప్పుదు మీతో మాట్లాడతానా అనే ఆలోచనలు .
!!!!!!!!!!!!!శ్రీరామా ఎందుకిలా !!!!!!!
No comments:
Post a Comment